తండాలకు రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం రేవంత్ హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: వికారాబాద్
వికారాబాద్ జిల్లా హకీంపేటలో అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తండాలకు రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రంతో అనుసంధానించాలని, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పీసీ తండాకు చెందిన మహిళ భూసమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కొడంగల్, మద్దూరులో పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.