వికారాబాద్ జిల్లాలో విషాదం: సుద్ద మైనింగ్ గుంతలో పడి ఇద్దరు యువకులు మృతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: వికారాబాద్

వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని తరిగోపుల గ్రామంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మేకలు మేపేందుకు వెళ్లిన అశోక్, శ్రీనివాస్ అనే యువకులు సుద్ద మైనింగ్ గుంతలో ప్రమాదవశాత్తు పడి నీట మునిగి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రయత్నించి లోతైన గుంతలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.