భారత సెమీకండక్టర్ రంగంపై కుట్రలు జరిగే ప్రమాదముంది అశ్విని వైష్ణవ్ హెచ్చరిక
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
భారతదేశ సెమీకండక్టర్ రంగంపై వివిధ రకాల కుట్రలు, దాడులు జరిగే ప్రమాదముందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు. యాపిల్ ఐఫోన్ల తయారీ సమయంలోనూ ఇలాంటి అడ్డంకులు, ఫేక్ వార్తలు సృష్టించారని ఆయన గుర్తుచేశారు. సెమీకండక్టర్ అనేది అత్యంత వ్యూహాత్మక రంగమని, సైబర్ దాడిలు, భౌతిక దాడులు మరియు తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనేందుకు పరిశ్రమ వర్గాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.