ఖమ్మం జిల్లాలో ఎస్సై వాహనాన్ని ఢీకొట్టిన లారీ నలుగురికి గాయాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తిరుమలాయపాలెం
తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్, డ్రైవర్ రాకేష్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వినాయక నిమజ్జన విధులు ముగించుకుని తిరుమలాయపాలెం వస్తుండగా పిండిప్రోలు శివారులోని భవానీ హోటల్ సమీపంలో కారును లారీ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఎస్సై, డ్రైవర్ను ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.