ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగింపు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఈ మేరకు అక్టోబరు పదహారున తుది జాబితా ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. వచ్చే నెల పదవ తేదీ వరకు నోటీసులు, క్లెయిమ్లు అలాగే అభ్యంతరాలు పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ను రాజకీయ పార్టీలకు రాతపూర్వకంగా తెలియజేయడంతో పాటు మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఈసీఐ స్పష్టం చేసింది.