నెట్స్ లో విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టిన జమ్మూకశ్మీర్ పేసర్ ఔకిబ్ నబీ

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆక్లాండ్

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని జమ్మూకశ్మీర్ యువ పేసర్ ఔకిబ్ నబీ తన బౌలింగ్ తో గట్టి పరీక్ష పెట్టినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఆక్లాండ్ లో సాగిన నెట్ ప్రాక్టీస్ లో రెండు వైపులా స్వింగ్ అయ్యే బంతులతో కోహ్లీని పలుమార్లు నబీ బీట్ చేశాడు. దీంతో ఈ యువ సంచలన బౌలింగ్ తీరు ప్రస్తుతం క్రికెట్ సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.