అంతర్జాతీయ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్
రిపోర్టర్: అశోక్
స్థలం: Hamilton
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అంతర్జాతీయ టీవంటీ చరిత్రలో సరికొత్త మైలురాయిని అందుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. భారత్ తో జరిగిన ఐదో టీవంటీ మ్యాచ్ ద్వారా అత్యధిక టీవంటీ మ్యాచ్ లు ఆడిన కివీస్ ఆటగాడిగా ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ఇష్ సోధి పేరిట ఉన్న రికార్డును సాంట్నర్ అధిగమించారని క్రీడా విశ్లేషకులు తెలిపారు.