పాలకుల నిర్లక్ష్యపు గోతుల్లో చితికిపోతున్న సామాన్యుడి బతుకు

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఒక ట్యాంకు నీటిని ప్రజలు పద్దెనిమిది వందల రూపాయలకు కొనుక్కుంటున్న దుస్థితి నెలకొంది. కొనుక్కుందామన్నా మంచి నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. బిందెడు నీళ్ల కోసం ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు సొంత డబ్బులతో వాటర్ కొని ట్యాంకర్లలో పంపిస్తున్నారు. నాలుగు రోజుల్లో తాగునీరు ఇవ్వకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.