విజయవాడలో సంచలనం: జైలు ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువతి అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

జైలులో ఉన్న ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డబ్బుల కోసం డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడిన సౌమ్య అనే యువతిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్, రైల్వే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆమె వద్ద సుమారు పదకొండు లక్షల విలువైన నిషేధిత డ్రగ్స్ లభించాయని, బషీర్ అనే వ్యక్తి ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.