క్రిప్టో చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్: ఆరు బిలియన్ల డోలర్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: Global
ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్ నెట్‌వర్క్‌లో జరిగిన భారీ సైబర్ దాడిలో సుమారు ఆరు బిలియన్ల డాలర్ల నిధులు చోరీకి గురయ్యాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఒక ఉద్యోగి ల్యాప్‌టాప్ హ్యాకర్ల బారిన పడటంతోనే ఈ భయానక ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. బ్లాక్‌చెయిన్ భాగస్వాముల సహాయంతో సుమారు మూడు బిలియన్ డాలర్లను ఇప్పటికే స్తంభింపజేయగా, వినియోగదారుల సొమ్ముకు ఎలాంటి ముప్పు లేదని బైనాన్స్ స్పష్టం చేసింది.