మెగాస్టార్ చిరంజీవి కాకా చిత్రంలో పాత్ర పేరు వెల్లడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కాకా చిత్రంలో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్ అని ఆయన తాజాగా వెల్లడించారు. వాల్తేరు వీరయ్య విజయవంతమైన జోడీ మరోసారి కలిసి పనిచేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమ్మజీ అక్వా ఇండస్ట్రీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనశ్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.