అనంతపురంలో షాకింగ్ ఘటన: ఇళ్లపై రాళ్ల దాడితో గ్రామస్థులు వణుకు
రిపోర్టర్: నరేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేటలో ఓ స్త్రీ రేపు రా సినిమాను తలపించేలా గోడలపై రాతలు దర్శనమివ్వడం కలకలం రేపింది. రాత్రివేళల్లో ఇళ్లపై అకస్మాత్తుగా రాళ్లు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని స్థానికులు తెలిపారు. పోలీసుల పహారాలోనూ ఈ దాడులు కొనసాగుతుండటంతో ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.