చౌటుప్పల్ సమీపంలో వాహనం ఢీకొని బోనాల పండుగకు ఇంటికి వస్తున్న విద్యార్థి దుర్మరణం!
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం స్టేజీ వద్ద గురువారం సాయంత్రం వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం బైక్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో బద్రి రాహుల్ (23) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ధర్మాజీగూడెంకు చెందిన రాహుల్ హైదరాబాద్‌లో చదువుకుంటూ, బోనాల పండుగ కోసం స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి లింగయ్య ఫిర్యాదుతో యూపీకి చెందిన డ్రైవర్ నాగేంద్ర ప్రతాప్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మధకుమార్ వెల్లడించారు.