సింగరేణిలో బొగ్గు కుంభకోణం కలకలం: సిట్టింగ్ జడ్జితో విచారణకు కేటీఆర్ డిమాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: Karimnagar
కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ కుంభకోణాల మయంగా మారిందని, రూ.1,600 కోట్ల విలువైన నలభై లక్షల టన్నుల బొగ్గు గల్లంతుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారని కరీంనగర్ ప్రతినిధి తెలిపారు. నైని బొగ్గు గని టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ సర్కార్ కార్మికులను మోసం చేసిందని ఆరోపిస్తూ బుధవారం కార్మిక గర్జన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.