మణికొండలో చెడ్డీ గ్యాంగ్ సంచారం అపార్ట్మెంట్లో చోరీ
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో చెడ్డీ గ్యాంగ్ సంచారం తీవ్ర కలకలం రేపింది. నెక్నాంపూర్లోని ఫ్లోటిల్లా అపార్ట్మెంట్లోకి చొరబడిన దుండగులు విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించిన స్థానికులపై నిందితులు ఆయుధాలతో దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.