విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై గద్వాల జిల్లా పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

రిపోర్టర్: శివ స్థలం: జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామపంచాయతీ కార్యదర్శి గొల్ల శేఖర్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం మరియు నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ శుక్రవారం సస్పెండ్ చేశారు. పలుమార్లు విచారణ చేపట్టి రికార్డులు పరిశీలించిన అనంతరం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.