ఆంధ్రప్రదేశ్‌లో 28 కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాలకు ప్రత్యేక జడ్పీలను మంజూరు చేయడంతో పాటు, 660 మండలాలను కొత్త జడ్పీల పరిధిలోకి మ్యాపింగ్ చేయాలని ఆదేశించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ కొత్త వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.