పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అన్న కేటీఆర్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులతో ప్రజల తీర్పును దొంగిలించారని, సుప్రీం తీర్పు వారిద్దరికీ గట్టి చెంపపెట్టు అని కేటీఆర్ మండిపడ్డారు.