ప్రజాపాలన స్ఫూర్తితో మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహనీయులు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాల స్పూర్తితో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తన్నీరు రమేష్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.