డక్కిలి మండలంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టిన టీడీపీ నాయకులు
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మార్లగుంట గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ పార్టీ విజయానికి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం రామచంద్రారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.