పుర ఎన్నికల్లో విచిత్ర ఘటన: హుండీలో ఓటుకు అందిన నగదు వేసిన అభ్యర్థి
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
పుర ఎన్నికల్లో ఓట్లు దక్కించుకునేందుకు ఓ ప్రధాన పార్టీ నాయకులు వినూత్న రీతిలో నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంచుతుండగా విచిత్ర పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఛైర్పర్సన్ స్థానానికి బరిలో నిలిచిన మువ్వల పద్మావతి ఇంటికి వెళ్లి ఆమె కుమార్తెకు కొందరు వనితలు నగదు అందజేశారు. ఆ డబ్బును తీసుకెళ్లి వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీలో వేశామని పద్మావతి స్పష్టం చేశారు.