దక్షిణ చైనా సముద్ర వివాదంపై చైనా తీరును ఎండగట్టిన ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి

రిపోర్టర్: రాము స్థలం: World

సియోల్ రక్షణ వేదికపై ఫిలిప్పీన్స్ రక్షణ కార్యదర్శి గిల్బెర్టో సి టెడోరో చైనా తీరును బహిరంగంగా తప్పుబట్టారు. సముద్ర సవాళ్లపై ఆయన మాట్లాడుతుండగా చైనా వాదనతో కూడిన లేఖను అందజేశారు. దానిని చదివిన ఆయన, చైనాకు ఎలాంటి చట్టబద్ధమైన స్థానం లేదని, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్య అంతర్జాతీయ వేదికలను, ఆతిథ్య దేశాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.