ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించవద్దని రైల్వే అధికారులను కోరిన పెద్దలు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలోని మల్లంపేటలో రెండు దశాబ్దాలుగా పూజలందుకుంటున్న ఆంజనేయస్వామి ఆలయానికి తొలగింపు ముప్పు పొంచివుంది. రైల్వే పనుల నిమిత్తం ఆలయాన్ని తొలగిస్తారనే సమాచారంతో గ్రామ పెద్దలు, కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులను కలిసి విగ్రహాన్ని వేరే ప్రాంతానికి మార్చవద్దని విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని వారు హెచ్చరించారు.