యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపై ఎలెనా రిబాకినా ఘన విజయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబలెంకాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైనల్ పోరులో ఎలెనా రిబాకినా చేతిలో సబలెంకా ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా సబలెంకా కోల్పోయింది. వరుసగా మూడో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాలన్న ఆమె కల ఆవిరికాగా, రిబాకినా అద్భుత ఆటతీరుతో ట్రోఫీని కైవసం చేసుకుంది.