హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారుపై పడిన తారుతో క్రషర్ యజమాని మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: నవీపేట

నవీపేట మండలం ఆశా నగర్ కాలనీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాయి శక్తి కన్స్ట్రక్షన్ క్రషర్ యజమాని ఏలేటి నవీన్ చంద్రారెడ్డి మృతి చెందినట్లు నవీపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కారులో వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అందులోని వేడి తారు ఆయన ఒంటిపై పడింది. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.