'సగటు బ్యాలెన్స్ కేవలం రూ.4,182 మాత్రమే..': మధ్యప్రదేశ్ జన్ ధన్ ఖాతాలపై కేంద్ర ఆర్టీఐ వెల్లడి
రిపోర్టర్: గోపి
స్థలం: భోపాల్
మధ్యప్రదేశ్‌లో జన్ ధన్ ఖాతాల తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4.76 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండగా, ఒక్కో ఖాతాలో సగటు బ్యాలెన్స్ కేవలం రూ.4,182 మాత్రమే ఉన్నట్లు తేలింది. జాతీయ సగటు రూ.5,338తో పోలిస్తే ఇది చాలా తక్కువని, దాదాపు మూడో వంతు ఖాతాలు అంటే 1.36 కోట్ల ఖాతాలు నిష్క్రియంగా లేదా సున్నా బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.