మున్సిపల్ ఎన్నికలు: మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మేయర్లు మరియు ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముహూర్తం ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన పదమూడు నగరపాలక సంస్థలు, డెబ్బై ఏడు మున్సిపాలిటీలు అలాగే పది నగర పంచాయతీల్ లో ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికల కోసం ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.