హిందూ ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు: విద్యార్థి నాయకురాలు నేహా బోరాపై బీజేపీ ధ్వజం

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

దేవాలయాలలో పూజారులు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ విద్యార్థి నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావజాలానికి అద్దం పడుతున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. హిందూ మతాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే హిందూ వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.