గోలులో మహిళా కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి స్వామి

రిపోర్టర్: సునీల్ స్థలం: ఒంగోలు

ఒంగోలులో జరిగిన 2025 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని వారిని అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. మహిళా పోలీసుల క్రమశిక్షణ, ప్రజలకు సేవ చేయాలన్న వారి సంకల్పబలం ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.