కమలం గూటికి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్: బీజేపీలో చేరిన హన్మంతరావు

రిపోర్టర్: శివ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్కు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గజవాడ హన్మంతరావుతో పాటు పలువురు ప్రముఖులు హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ విషయాన్ని నిజామాబాద్ నాయకులు Arvind Dharmapuri వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరడంతో సంస్థాగతంగా మరింత బలం చేకూరుతుందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత ఉత్సాహంగా పోరాటాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు.