తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన కీలక బీఆర్ఎస్ సమావేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినాయకత్వం కీలక సమావేశం నిర్వహించింది. కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమీక్షించారు. వచ్చే వారం తెలంగాణ భవన్‌లో జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా హాజరుకానున్నారు. కేసీఆర్ రాకతో శ్రేణుల్లో జోష్ వస్తుందని భావిస్తున్నారు.