అండాశయ క్యాన్సర్ ముప్పు: పిల్లలు కన్న మహిళల్లో రిస్క్ తగ్గుతుందా
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
పిల్లలు కన్న మహిళల్లో అండాశయ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని యశోద హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం.వి. జ్యోత్స్న వెల్లడించారు. గర్భధారణ సమయంలో అండం విడుదల తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల కణాలకు విశ్రాంతి లభిస్తుందని తెలిపారు. అయితే పిల్లలు లేనంత మాత్రాన క్యాన్సర్ సోకుతుందని భావించరాదని, వయస్సు, వంశపారంపర్య జన్యు మార్పులు వంటి ఇతర కారణాలు కూడా ప్రభావం చూపుతాయని ఆమె స్పష్టం చేశారు.