క్రీడా ప్రియులకు గుడ్ న్యూస్: WPL ఐదో సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా విడుదల చేసిందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈసారి వడోదర, ముంబై నగరాలు సంయుక్తంగా మ్యాచ్ లకూ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 22 మ్యాచ్ లు జరగనున్న ఈ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జనవరి 14న తొలి సమరం జరగనుంది.