'12,405 ఖాళీల భర్తీ': యూపీ సూపర్ టెట్ దరఖాస్తులు ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో యూపీ సూపర్ టెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలలో మొత్తం 12,405 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షలను డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.