కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
మనుబోలు మండలం వీరంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా సాయి నీలిమ బరిలో నిలిచారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆ పార్టీల మోసాలను ఎండగట్టాలని కోరారు. మనుబోలు పొదలకూరు మండలాల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.