ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడకుండా ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్న సన్యాసిపాత్రుడు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు మాట్లాడారు. నర్సీపట్నంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ఎటువంటి భయాలకు లోనుకాకుండా, తమ అమూల్యమైన ఓటు హక్కును ఉపయోగించుకుని ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.