హిందూ వ్యతిరేక భావజాలంపై బీజేపీ మండిపాటు: నేహా బోరా వ్యాఖ్యలపై దుమారం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
బ్రాహ్మణీయ వ్యవస్థపై ఐసా నేత నేహా బోరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఆలయాల్ లో పూజారులపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు. రాహుల్ గాంధీ అనుచరులు హిందూ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విభజన రాజకీయాలను ప్రొజెక్ట్ చేయడం మానుకోవాలని కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేశారు.