ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి మృతిపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీకాకుళం
మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఆనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పవిత్రమైన విద్యాసంస్థల్లో ఇటువంటి ప్రమాదాలు జరగడం చాలా బాధాకరమని పేర్కొంటూ, ఈ విచారకరమైన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు.