మురసు తుపాను ప్రభావం: చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బాపట్ల
మురసు తుపాను తీవ్రత కారణంగా బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వినోద్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తుండటంతో లెక్కింపునకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రజలు, కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ ప్రక్రియను ఈ నెల ఆరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.