పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
రిపోర్టర్: రాము
స్థలం: పులివెందుల
పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ నిలిపివేయాలంటూ వైకాపా నేతలు వైఎస్ ప్రమీల, వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. నాలుగు వార్డుల్లోనే కాకుండా మిగతా అన్ని వార్డుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలన్న వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. సోమవారం వాదనలు ముగియగా మంగళవారం ఉదయం కోర్టు తుది తీర్పు వెలువరించింది.