రేపల్లెలో తీర ప్రాంత ప్రజల కల సాకారం: వంద పడకల ఆసుపత్రికి నిధులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: బాపట్ల

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపల్లె తీర ప్రాంత ప్రజల రెండు దశాబ్దాల కల సాకారమైందని ఆనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే వెల్లడించారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ముప్పై పడకల నుంచి వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఆధునిక వసతులు మరియు అత్యవసర సేవల కోసం యాభై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నిధులతో పాటు అదనంగా అరవై ఆరు పోస్టులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.