వైద్య పరికరాలపై ప్రైవేట్ ఆసుపత్రుల భారీ దోపిడీ వెలుగులోకి

రిపోర్టర్: రమేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బట్టబయలైంది. వైద్య పరికరాల కొనుగోలు ధరకు, ఎంఆర్‌పీకి అసలు పొంతనే లేదని ఎఫ్‌డీఏ సర్వేలో తేలింది. రూ. 11 ఐవీ సెట్‌ను రూ. 325 కి అమ్ముతూ ఏకంగా 2,841 శాతం లాభం దండుకుంటున్నాయి. ఈ భారీ దోపిడీపై కేంద్రం జోక్యం చేసుకుని ట్రేడ్ మార్జిన్లపై పరిమితులు విధించాలని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారం ముండే విజ్ఞప్తి చేశారు.