జమ్మూకశ్మీర్లో యువత కోసం ప్రత్యేక క్రీడా టోర్నమెంట్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Poonch
జమ్మూకశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో యువతను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు భారత సైన్యం కోకో, హ్యాండ్బాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని యువతుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువత నుంచి విశేష స్పందన లభించింది.