మహిళా శక్తికి సరికొత్త వేదికలు: ప్రారంభానికి ముస్తాబైన ఇందిరా మహిళా శక్తి భవనాలు

రిపోర్టర్: హరి స్థలం: వికారాబాద్

తెలంగాణలో మహిళా శక్తికి సరికొత్త వేదికలు రూపుదిద్దుకున్నాయని, రాష్ట్రంలోని జిల్లాల వారీగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి ముస్తాబైన ఇందిరా మహిళా శక్తి భవనాలు మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు సరికొత్త నిలయాలుగా మారబోతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. మన స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతి లక్ష్యంగా ఈ భవనాలను నిర్మించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన వేదికల ద్వారా మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్కార్ భావిస్తోంది.