విశాఖలో వ్యక్తి స్పాట్ డెడ్... మరొకరికి గాయాలు

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖలోని NAD కొత్త రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. R&B జంక్షన్ నుంచి NAD జంక్షన్ వైపు ఇద్దరు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శాంతినగర్కు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.