తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. 18 గంటల వేచిఉండే సమయం!

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్షేత్రం కిటకిటలాడుతోంది. ఎలాంటి టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు బారులు తీరారు. గురువారం ఒక్కరోజే 68,433 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.