హైవేపై ఘోర ప్రమాదం: నిద్రమత్తులో టెస్లా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన డ్రైవర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: California
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైవే పెట్రోలింగ్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇంటర్‌స్టేట్ హైవేపై పూర్తి ఆటోమేటిక్ డ్రైవింగ్ ఫీచర్ వాడుతూ నిద్రమత్తులోకి జారుకున్న ఇరవై రెండేళ్ల టెస్లా డ్రైవర్, ట్రాఫిక్ నిలిపివేసిన ప్రాంతంలో ఆగిఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా, డ్రైవర్ల అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేశారు.