తుపాను నష్టంపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

అర్నబ్ తుపాను నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కేంద్ర బృందం ప్రాణనష్టం తగ్గించడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించింది అని కేంద్ర అధికారులు వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ బృందం సమావేశమై నష్టాన్ని వివరించింది. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్ లో పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించామని, త్వరలోనే కేంద్రానికి నివేదిక అందిస్తామని తెలిపారు.