ఆమనగల్లులో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోస్ట్ ఆఫీస్ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.