మున్సిపల్ ఉద్యోగుల వేతన కోతల జీవోను రద్దు చేయాలి: హరీశ్ రావు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించడంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 1181 ఉద్యోగుల పాలిట శాపమని, ఇది ప్రజా పాలన కాదు ప్రజా పీడన అని మండిపడ్డారు. 31 వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, వెంటనే వివాదాస్పద జీవోను రద్దు చేసి వేతన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.